Python: ఏపీ జెన్ కో గెస్ట్ హౌస్ లో భారీ కొండచిలువ కలకలం
- రాత్రివేళ గెస్ట్ హౌస్ వద్దకు వచ్చిన కొండచిలువ
- భయాందోళనలకు గురైన సిబ్బంది
- స్థానికంగా ఉంటున్న జెన్ కో ఉద్యోగికి సమాచారం అందించిన వైనం
- చాకచక్యంగా పామును పట్టుకున్న ఉద్యోగి
- పామును సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టిన అటవీశాఖ సిబ్బంది
అల్లూరి జిల్లా లోయర్ సీలేరు ప్రాజెక్టు వద్ద ఉన్న ఏపీ జెన్ కో గెస్ట్ హౌస్ లో భారీ కొండచిలువ అందరినీ హడలెత్తించింది. రాత్రివేళ విధుల్లో ఉన్న సిబ్బంది ఈ కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు.
స్థానికంగా నివాసం ఉంటున్న జెన్ కో ఉద్యోగి చింతా రాంబాబు ఈ కొండచిలువపై సమాచారం అందుకుని, హుటాహుటీన గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. ఆ భారీ సర్పాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు.
ఆ కొండచిలువను అటవీ సిబ్బందికి అప్పగించగా, వారు దాన్ని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా, ఆ కొండచిలువ 12 అడుగుల పొడవు ఉన్నట్టు గుర్తించారు.