BJP: తెలంగాణకు ఎన్నికల ఇంఛార్జ్‌గా ప్రకాశ్ జవదేకర్... బీజేపీ హైకమాండ్ నిర్ణయం

BJP appoints election in charges for four poll bound states
  • తెలంగాణ సహాయ ఇంఛార్జ్‌గా సునీల్ బన్సల్
  • ఐదారు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు
  • ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకూ ఇంఛార్జ్‌ల నియామకం
తెలంగాణ ఎన్నికల ఇంఛార్జ్‌గా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను బీజేపీ అధిష్ఠానం నియమించింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లను నియమించింది. 

తెలంగాణకు ప్రకాశ్ జవదేకర్ ను ఇంఛార్జ్‌గా, సునీల్ బన్సల్ ను సహాయ ఇంఛార్జ్‌గా నియమించింది. మరో ఐదారు నెలల్లో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే.

ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఓపీ మాథుర్, సహాయ ఇంఛార్జ్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా మన్‌సుఖ్ మాండవీయ, రాజస్థాన్ ఇంఛార్జ్‌గా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ ఇంఛార్జ్‌గా గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్‌గా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, సహాయ ఇంఛార్జ్‌గా కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను నియమించింది.
BJP
Prakash Javadekar
Telangana

More Telugu News