Mobile Blast: నెల్లూరు ఇంజినీరింగ్ విద్యార్థి జేబులో పేలిన సెల్‌ఫోన్.. తీవ్ర గాయాలు

Mobile Blast In Engineering Student Pocket In Nellore
  • పరీక్ష రాసేందుకు స్కూటీపై వెళ్తుండగా ఘటన
  • పేలుడుతో అదుపుతప్పి కిందపడిన విద్యార్థి
  • ఆసుపత్రికి తరలించిన స్థానికులు
నెల్లూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి జేబులోని సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లాలోని లింగసముద్రం మండలం చిన్నపవనికి చెందిన సాయిప్రదీప్ నిన్న బోగోలు మండలం కడనూతలలోని ఆర్ఎస్ఆర్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు స్కూటీపై బయలుదేరాడు. 

మార్గమధ్యంలో కొత్తపల్లి వద్ద  జేబులోని మొబైల్ ఫోన్ ఒక్కసారి పేలింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్ బల్లను ఢీకొట్టి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని కావలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఓ ప్రముఖ బ్రాండ్‌ ఫోన్‌ను తాను ఇటీవలే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్టు సాయి తెలిపాడు.
Mobile Blast
Nellore District
Andhra Pradesh

More Telugu News