Vasireddy Padma: నందిగామ యాసిడ్ దాడి బాధితులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma visits Nandigama acid attack victims

  • ఇటీవల నందిగామలో మహిళపైనా, ఆమె బంధువులపైనా యాసిడ్ దాడి
  • నిందితుడు మణిసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • చికిత్స పొందుతున్న బాధితులు
  • బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ

ఇటీవల నందిగామలో ఓ మహిళపైనా, ఆమె బంధువులపైనా యాసిడ్ దాడి జరగడం తెలిసిందే. తిరుపతమ్మ అనే మహిళతో సహజీవనం చేసిన మణిసింగ్ అనే ఆటోడ్రైవర్... తిరుపతమ్మ మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందని భావించి ఈ దాడికి పాల్పడ్డాడు. 

కాగా, నందిగామ యాసిడ్ దాడి ఘటనలో గాయపడిన బాధితులను రాష్ట్ర  మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నేడు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, బాధితురాలి ముఖం, శరీర భాగాలు కాలిపోయాయని, ప్రాణాపాయం తప్పిందని వెల్లడించారు. ఆ మహిళ భర్త చనిపోతే కొడుకుతో కలిసి జీవిస్తోందని తెలిపారు. 

నిందితుడు ఉద్దేశపూర్వకంగా యాసిడ్ తో దాడి చేశాడని పద్మ తెలిపారు. యాసిడ్ దాడి ఘటనలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లతో మాట్లాడిన అనంతరం వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, కొత్త వ్యక్తులతో పరిచయాల పట్ల మహిళాలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

నెల రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు. ప్రమాదం సంభవిస్తుందన్నప్పుడు దిశా యాప్ ద్వారా రక్షణ పొందే అవకాశం ఉందని అందరూ గుర్తించాలని సూచించారు.

  • Loading...

More Telugu News