Ram Charan: 'గేమ్ చేంజర్' కోసం ఫైట్లు చేయనున్న రామ్ చరణ్

Ram Charan joins Game Changer team for new schedule in Hyderabad
  • శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్
  • హైదరాబాదులో జులై 11 నుంచి కొత్త షెడ్యూల్
  • రామ్ చరణ్ పై యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దక్షిణాది హిట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ భారీ ప్రాజెక్టుపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే హైదరాబాదులో షూటింగ్ జరుపుకోనుంది. జులై 11 నుంచి జరిగే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొంటారు. రామ్ చరణ్ పై కొన్ని ఫైటింగ్ సీక్వెన్స్ లను చిత్రీకరించనున్నారు. 

ఆచితూచి ఖర్చు చేస్తాడని, మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తాడని పేరున్న దిల్ రాజ్ గేమ్ చేంజర్ కోసం భారీ బడ్జెట్ తో ముందుకు రావడం విశేషం. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్, హిట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దిల్ రాజు... ఈ ముగ్గురి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో హైప్ ఓ రేంజిలో కొనసాగుతోంది. 

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ వస్తుందని భావిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Ram Charan
Game Changer
New Schedule
Action Sequences

More Telugu News