JC Prabhakar Reddy: చెప్పుతో కొడతానన్న కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్

JC Prabhakar Reddy fires on ketireddy venkatrami reddy
  • ఆధారాలు చూపిస్తా మీ చిన్నాన్నను కొడతావా అంటూ ఛాలెంజ్
  • ధర్మవరం, పుట్టపర్తి నుంచి కేతిరెడ్డి బాధితులు తనకు ఫోన్లు చేస్తున్నారని వెల్లడి
  • ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై మండిపడ్డ జేసీ
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీ కుటుంబం ఎలా బతికిందో చెబుతాను.. చెప్పుతో కొడుదువురమ్మంటూ సవాల్ విసిరారు. ‘మీ చిన్నాన్న చేసిన బీమా అక్రమాల గురించి ఆధారాలు ఇస్తాను చెప్పుతో కొట్టు’ అంటూ మండిపడ్డారు. లండన్ లో వెయిటర్ గా పనిచేసిన కేతిరెడ్డి ఇక్కడికి వచ్చి గొప్పలు చెబుతున్నాడంటూ విమర్శించారు. ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి కేతిరెడ్డి బాధితులు ఆధారాలు ఇస్తామంటూ తనకు ఫోన్లు చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డిలపై జేసీ ప్రభాకర్ రెడ్డి శనివారం విమర్శలు గుప్పించారు. దీనిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. దీంతో తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరోమారు మీడియా ముందుకువచ్చి కేతిరెడ్డిపై విమర్శలు చేశారు. తన ఆరోపణలకు ఆధారాలు అందిస్తానని, దమ్ముంటే నిందితులను చెప్పుతో కొట్టాలని సవాల్ చేశారు.
JC Prabhakar Reddy
ketireddy
Andhra Pradesh
tadipatri
Dharmavaram
challenge

More Telugu News