Dhanush: నటుడు ధనుష్, ఐశ్వర్యలకు ఊరట.. ‘రఘువరన్ బీటెక్’కు సంబంధించిన కేసు కొట్టివేత

Madras High Court quashes complaint against Dhanush Aishwarya Rajinikanth for smoking scenes

  • ‘వేలైయిల్లా పట్టదారి’ సినిమాలో ధనుష్ పొగతాగే సీన్లలో తెరపై హెచ్చరిక సరిగా కనిపించలేదని ఫిర్యాదు
  • ధనుష్, ఐశ్యర్యలపై కేసు దాఖలు చేసిన తమిళనాడు ఆరోగ్య శాఖ
  • సైదాపేట కోర్టులో కొనసాగుతున్న విచారణ
  • కేసు కొట్టేయాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ధనుష్, ఐశ్వర్య 
  • ధనుష్, ఐశ్వర్యకు అనుకూలంగా కోర్టు తీర్పు

నటుడు ధనుష్, ఐశ్వర్యలకు మద్రాస్ హైకోర్టులో తాజాగా ఊరట లభించింది. ధనుష్ నటించిన ‘వేలైయిల్లా  పట్టదారి’ సినిమాలో (తెలుగులో రఘువరన్ బీటెక్) సిగరెట్, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, క్రమబద్ధీకరణ చట్ట ఉల్లంఘనలు జరిగాయంటూ దాఖలైన కేసును కొట్టేస్తూ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. 

సినిమాలో నటుడు ధనుష్ సిగరెట్ తాగే సన్నివేశాల్లో స్క్రీన్‌పై హెచ్చరికలు సరిగా కనిపించలేదని, కాబట్టి నటుడు ధనుష్, నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ పొగాకు నియంత్రణ సంస్థ తరపున తమిళనాడు ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్, సైదాపేట కోర్టులో ఐశ్యర్య, ధనుష్‌లపై కేసు దాఖలు చేశారు. న్యాయస్థానంలో ఈ కేసుపై విచారణ జరుగుతుండగా ధనుష్, ఐశ్వర్య హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు కొట్టేయాలంటూ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి ఆనంద వెంకటేశ్ కేసును కొట్టేస్తూ సోమవారం తీర్పు వెలువరించారు.

  • Loading...

More Telugu News