Migrants Missing: పడవల్లో స్పెయిన్ వెళ్తూ 300 మంది అదృశ్యం

300 migrants bound to Spains Canary Islands went missing

  • మూడు పడవల్లో సెనెగల్ నుంచి కానరీ దీవులకు బయలుదేరిన వసలదారులు
  • వారంతా ఏమయ్యారో తెలియక కుటుంబాల ఆందోళన
  • ఇలా వెళ్తూ గతేడాది 1,784 మంది మృత్యువాత

మూడు పడవల్లో వెళ్తున్న 300 మంది వలసదారులు అట్లాంటిక్ మహా సముద్రంలో అదృశ్యమయ్యారు. 15 రోజుల క్రితం వీరంతా సెనెగల్ నుంచి స్పెయిన్‌లోని కానరీ ఐలండ్స్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక బోటులో 200 మంది, మిగతా రెండు బోట్లలో ఒకదాంట్లో 65 మంది, మరో దాంట్లో 60 మంది ఉన్నట్టు వలసదారులకు సాయం చేసే ‘వాకింగ్ బోర్డర్స్’ సంస్థ తెలిపింది. అదృశ్యమైన వారు ఏమయ్యారో తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

ఆఫ్రికా నుంచి కానరీ ఐలండ్స్‌కు వలసదారులు తరలిపోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. మరీ ముఖ్యంగా వేసవిలో ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. గతేడాది 22 మంది చిన్నారులు సహా 559 మంది కానరీ ఐలండ్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వలసల సంస్థ (ఐవోఎం) తెలిపింది.  ఇలా వెళ్తూ గతేడాది 1,784 మంది వలసదారులు మరణించినట్టు వాకింగ్ బోర్డర్స్ పేర్కొంది. గతేడాది కానరీ ఐలండ్స్‌కు 15,682 మంది చేరుకున్నారని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 30 శాతం తగ్గిందని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News