Kodi Kathi Case: జగన్ పై దాడి కేసు: తిరిగి విచారిస్తే.. కుట్ర కోణం వెలుగులోకి వస్తుంది: జగన్ తరపు న్యాయవాది
- కేసు విచారణలో ఎన్ఐఏ పలు విషయాలను పరిగణనలోకి తీసుకోలేదన్న జగన్ తరపు న్యాయవాది
- జగన్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది వెంకటేశ్వర్లు
- కేసు విచారణ నేటికి వాయిదా
సంచలనం సృష్టించిన జగన్ పై దాడి కేసు విచారణ కొనసాగుతోంది. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో నిన్న ఈ కేసు విచారణ జరిగింది. జగన్ తరపు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ కేసును తిరిగి విచారించాలని, అప్పుడే కుట్ర కోణం వెలుగులోకి వస్తుందని ఆయన కోరారు. ఈ కేసులో పలు విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసిందన్నారు.
కేసు విచారణను ఇన్ కెమెరా పద్ధతిలో చేపట్టాలన్న ఆయన అభ్యర్థన మేరకు న్యాయమూర్తి సత్యానంద్ విచారణ చేపట్టారు. కాగా, నిందితుడి తరపు న్యాయవాది సలీం అనంతరం మీడియాతో మాట్లాడుతూ విచారణకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఎన్ఐఏ, నిందితుడి తరపున వాదనలు వినిపించేందుకు కేసును నేటికి వాయిదా వేసినట్టు తెలిపారు.