Nikhil: మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసిన నిఖిల్!

Nikhil in V I Anand Movie
  • నిఖిల్ ను నిరాశపరిచిన 'స్పై'
  • షూటింగు దశలో 'స్వయంభూ'
  • మరో ప్రాజెక్టుకి ఖరారు కానున్న టైటిల్
  • వీఐ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాకి సన్నాహాలు  
మొదటి నుంచి కూడా నిఖిల్ తన రేంజ్ ను పెంచే సినిమాలనే చేస్తూ వెళుతున్నాడు. కొత్త కంటెంట్ లో కనిపించడానికి ఎప్పటికప్పుడు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. ఆ మధ్య వచ్చిన 'కార్తికేయ 2' ఆయనకి పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత వచ్చిన 'స్పై' మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది.

ప్రస్తుతం నిఖిల్ రామ్ వంశీకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'ది ఇండియా హౌస్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరో వైపున 'స్వయంభూ' సినిమాను కూడా ఆయన పూర్తిచేసే పనిలో ఉన్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుద్ధవీరుడిగా నిఖిల్ కనిపించనున్నాడు. 

ఇక ఆ తరువాత ప్రాజెక్టును కూడా ఆయన లైన్లో పెట్టినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. గతంలో నిఖిల్ తో 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' సినిమాను చేసిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వదలనున్నారని అంటున్నారు. వీఐ ఆనంద్ కథలు .. కాన్సెప్టులు డిఫరెంట్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే. 
Nikhil
V I Anand
Tollywood

More Telugu News