Rajasthan: స్మార్ట్‌ఫోన్‌తో విపరీతంగా ఆటలు.. మతిస్థిమితం కోల్పోయిన బాలుడు

boy suffers memory loss after losing pubg in rajasthan alwar

  • రాజస్థాన్‌లోని అల్వార్‌లో వెలుగు చూసిన ఘటన
  • ఖాళీ సమయాల్లో స్మార్ట్‌ఫోన్లో బాలుడి ఆటలు, వ్యసనంగా మారిన అలవాటు
  • ఇటీవల ఆటలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక మతిస్థిమితం తప్పిన వైనం
  • బాలుడికి ప్రత్యేక పాఠశాలలో భౌతిక క్రీడలు ఆడిస్తూ చికిత్స అందిస్తున్న నిపుణులు

అదుపుతప్పిన స్మార్ట్‌ఫోన్ వినియోగం బాల్యాన్ని చిదిమేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌కు బానిసైపోయిన ఓ పదేళ్ల బాలుడు చివరకు మతిస్థిమితం కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో తాజాగా వెలుగు చూసింది. అల్వార్‌కు చెందిన చిన్నారి నిత్యం ఫోన్‌లో పబ్‌జీ ఆడుతూ గడిపేసేవాడు. 

ఇటీవల గేమ్‌లో ఓడిపోయిన అతడు నిరాశను తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయాడు. ప్రస్తుతం అతడికి ప్రత్యేక పాఠశాలలో నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ఆడిస్తూ బాలుడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పాఠశాల టీచర్ భవానీ శర్మ మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News