Stock Market: 66 వేల మార్క్ ను టచ్ చేసిన సెన్సెక్స్
- 165 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 29 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రెండున్నర శాతం వరకు పెరిగిన టీసీఎస్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం దిగిరావడం మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 65,559కి చేరుకుంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 19,414 వద్ద స్థిరపడింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 66,064 వద్ద సరికొత్త గరిష్ఠ స్థాయులను టచ్ చేసింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాలు తగ్గిపోయాయి. ఐటీ, టెక్, రియాల్టీ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (2.47%), ఇన్ఫోసిస్ (2.40%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.51%), టెక్ మహీంద్రా (1.35%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.32%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.63%), మారుతి (-1.86%), ఎన్టీపీసీ (-1.26%), రిలయన్స్ (-0.83%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.82%).