Ambati Rayudu: గుంటూరు జిల్లాలో ఓ పాఠశాలకు రూ.5 లక్షల సాయం అందించిన అంబటి రాయుడు

Ambati Rayudu donates Rs 5 lakhs to a school in Guntur district
  • క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు పలికిన అంబటి రాయుడు
  • రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం
  • ఇటీవల పలుమార్లు ఏపీ సీఎం జగన్ తో భేటీ
  • తరచుగా గుంటూరు జిల్లాలో పర్యటనలు
ఐపీఎల్ సహా అన్ని రకాల క్రికెట్ కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగప్రవేశానికి వేదికను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పలుమార్లు సీఎం జగన్ తో సమావేశమైన రాయుడు, గుంటూరు జిల్లాలో తరచుగా పర్యటిస్తూ వివిధ వర్గాలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తాజాగా, ముట్లూరులో పర్యటించిన రాయుడు స్థానిక సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల సాయం అందించారు. పాఠశాలలో సౌకర్యాల ఏర్పాటుకు ఆ డబ్బు ఉపయోగించాలని సూచించారు. ఆ మేరకు చెక్కు అందించారు. అంతేకాదు, హైస్కూల్ భవనాలను, క్రీడా మైదానాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యతను స్వీకరిస్తానని, పాఠశాలకు పూర్వ వైభవాన్ని చేకూర్చుతానని రాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది రాయుడిని ఘనంగా సత్కరించారు. 

కాగా, అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాడన్న ప్రచారం జరుగుతోంది. మరి కొన్ని రోజులు ఆగితే తప్ప దీనిపై స్పష్టత వచ్చే అవకాశాల్లేవు.
Ambati Rayudu
Donation
School
Mutluru
Guntur District
YSRCP

More Telugu News