Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీళ్లు బంద్

Drinking water shutdown for 36 hours in these areas of Hyderabad

  • బుధవారం ఉ.6 నుంచి గురువారం సా. 6 వరకు
  • పెద్దపల్లి జిల్లాలో ప్రధాన పైప్‌లైన్‌కు మరమ్మతు
  •  కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 36 గంటల పాటు తాగునీటికి అంతరాయం కలగనుంది. ఈ నెల 19, బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటలకు  పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఒకటో దశలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఓ ప్రధాన పైపులైన్ లీకేజీ మరమ్మతు పనుల నేపథ్యంలో సరఫరా నిలిచిపోనుందని వెల్లడించారు.

నగరంలోని పలు డివిజన్లలో పూర్తిగా, మరికొన్ని డివిజన్లలో పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం కలుగనుందని జలమండలి తెలిపింది. ఓ అండ్ ఎం డివిజన్లు అయిన కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి/అల్వాల్, ఉప్పల్, నాగారం/దమ్మాయిగూడ, కొంపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. ఎస్ఆర్‌‌నగర్, శేరిలింగంపల్లి, నిజాంపేట్‌ డివిజన్లలో పాక్షికంగా అంతరాయం కలుగనుంది.

  • Loading...

More Telugu News