Rangasthalam: జపాన్ లో 'రంగస్థలం' ప్రభంజనం... తొలి రోజే రికార్డు బ్రేక్

Ram Charan Rangasthalam set record in Japan on release day
  • రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం
  • 2018లో బ్లాక్ బస్టర్ హిట్టయిన రంగస్థలం
  • తాజాగా జపాన్ లో విడుదల
  • టోక్యో నగరంలో 70 స్క్రీన్లపై ప్రదర్శన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో 2018లో వచ్చిన రంగస్థలం చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇందులో చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకోగా, కలెక్షన్ల పరంగా బాక్సాఫీసును ఈ సినిమా షేక్ చేసింది. 

తాజాగా రంగస్థలం చిత్రాన్ని జపాన్ లో విడుదల చేశారు. తొలిరోజే ఈ చిత్రం రికార్డులు బద్దలు కొడుతూ ప్రభంజనం సృష్టించింది. టోక్యో నగరంలో మొదటి రోజున 70 స్క్రీన్లలో విడుదల చేయగా, 2.5 మిలియన్ల యెన్లను వసూలు చేసింది. భారతీయ చిత్రాల్లో విడుదల రోజున ఈ స్థాయిలో వసూలు చేసిన తొలి చిత్రంగా రంగస్థలం సరికొత్త రికార్డు నమోదు చేసింది. 

రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా జపనీయులు విశేషంగా ఆదరించారు. జపాన్ లో తెలుగు సినిమాలకు, ఇతర భారతీయ భాషల సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.
Rangasthalam
Japan
Release
Ramcharan
Samantha
Sukumar

More Telugu News