ITD: కొందరు ఎన్నారైల పాన్ కార్డులు పనిచేయడం లేదా.... ఐటీ శాఖ ఏం చెబుతోందంటే...!
- పాన్ కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అంటున్న ఐటీ శాఖ
- జూన్ 30తో ముగిసిన గడువు
- ఇది ఎన్నారైలకు వర్తించకపోయినా... పనిచేయని పాన్ కార్డులు
- ఎన్నారైల పాన్ కార్డులు ఎందుకు పనిచేయవో కారణాలు వివరించిన ఐటీ శాఖ
పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో స్పష్టం చేసింది. ఈ మేరకు గడువు కూడా ముగిసింది. పాన్ తో ఆధార్ ను అనుసంధానం చేయకపోతే, ఇలాంటి వారి పాన్ కార్డులు పనిచేయవు. అయితే ఇది ఎన్నారైలకు వర్తించదు. అయినప్పటికీ కొందరు ఎన్నారైల పాన్ కార్డులు పనిచేయడం లేదంటూ ఐటీ శాఖకు వినతులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. దీనిపై ఐటీ శాఖ స్పందించింది.
కొందరు ఎన్నారైలు, ఓసీఐ (ఓవర్సీస్ సిటిజెన్ షిప్ ఆఫ్ ఇండియా) వ్యక్తుల పాన్ కార్డులు పనిచేయడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఐటీ శాఖ వెల్లడించింది. కొందరి పాన్ కార్డులు ఎందుకు పనిచేయవన్న దానికి గల కారణాలు వివరించింది.
అయితే పాన్ కార్డు పనిచేయకపోతే ఉత్పన్నమయ్యే సమస్యలు ఇలా ఉంటాయి...
I. పెండింగ్ లో ఉన్న రిఫండ్ లు చెల్లించరు, అలాంటి రిఫండ్ లపై వడ్డీలు చెల్లించబడవు.
II. సెక్షన్ 206AA ప్రకారం అధికరేటుతో టీడీఎస్ మినహాయించుకుంటారు.
III. సెక్షన్ 206CC ప్రకారం అధికరేటుతో టీసీఎస్ ను వసూలు చేస్తారు.
వీటన్నింటిని గమనించి ఎన్నారైలు, ఓసీఐ వ్యక్తులు తమ ప్రస్తుత వివరాలను నవీకరించుకోవాలని ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ సూచించింది. ఆ మేరకు జేఏఓ పోర్టల్ వివరాలను కూడా తన ప్రకటనలో పొందుపరిచింది.
జేఏఓ వివరాలకు https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/knowYourAO పోర్టల్ ను సందర్శించాలని పేర్కొంది.