Jeevitha Rajasekhar: పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష

Jeevitha Rajasekhar Get One Year Imprisionment In Defamation Case

  • చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపణ
  • పరువునష్టం దావా వేసిన అల్లు అరవింద్
  • సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు
  • జరిమానా చెల్లించడంతో అప్పీలుకు అవకాశం

పరువునష్టం కేసులో ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు.

చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన, ట్రస్టు పైనా అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిన్న కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. అయితే, జరిమానా చెల్లించడంతో పైకోర్టులో అప్పీలుకు అవకాశమిస్తూ బెయిలు మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News