Singapore: సింగపూర్ పార్లమెంటు సభ్యురాలితో ఎఫైర్.. భారత సంతతి ఎంపీ రాజీనామా

Indian origin singapore mp resigns over allegations of illicit relationship with fellow mp
  • సింగపూర్ పార్లమెంటులో వివాహేతర సంబంధాల కలకలం 
  • భారత సంతతికి చెందిన ఎంపీ లియాన్‌ పెరేరా, ఓ మహిళా ఎంపీతో సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్
  • విమర్శలు వెల్లువెత్తడంతో ఇద్దరూ రాజీనామా
  • రెండు రోజుల క్రితం ఇవే ఆరోపణలపై స్పీకర్, మరో మహిళా ఎంపీ రాజీనామా
పార్లమెంట్ ఎంపీల మధ్య అక్రమసంబంధాల అంశం సింగపూర్‌లో కల్లోలానికి దారి తీసింది. తన పార్టీకే చెందిన మహిళా ఎంపీతో ఎఫైర్ పెట్టుకున్న ఓ భారత సంతతి ఎంపీ రాజీనామా చేశారు. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీకి చెందిన లియాన్ పెరేరా(53), నికోల్ సీహ్(36)తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వారిద్దరూ ఇలా అనైతికతకు తెరలేపడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అయితే, రెండు రోజుల క్రితం ఇవే ఆరోపణలపై పార్లమెంటు స్పీకర్, అధికార పీఏపీ పార్టీకి చెందిన మరో మహిళా ఎంపీ రాజీనామా చేశారు. వారి రాజీనామాలు ఆమోదిస్తున్నట్టు ప్రధాని లీ సీన్ లూంగ్ పేర్కొన్నారు.
Singapore
NRI
Parliament

More Telugu News