Samantha: ధ్యానం సింపుల్.. కానీ పవర్‌ఫుల్: సమంత

Samantha attends meditation program in esha foundation
  • కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌‌కు వెళ్ళిన సమంత
  • సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న నటి
  • ధ్యానస్థితిలో తన అనుభూతిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్
ప్రముఖ నటి సమంత బుధవారం కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌కు వెళ్లారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో అందరితో కలిసి ధ్యానం చేశారు. అనంతరం, ధ్యానంలో తనకెదురైన అనుభూతిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

‘‘మదిలో ఆలోచనల ఉద్ధృతి, శరీరంలో కదలికలు లేని నిశ్చలమైన స్థితి అసాధ్యమని నాకిప్పటివరకూ అనిపించింది. కానీ ఈ రోజు ధ్యానస్థితి నాకు శక్తి, ఆలోచనల్లో స్పష్టత, ప్రశాంతను ఇచ్చింది. సరళమైన ధ్యానప్రక్రియ ఇంతటి శక్తిమంతమైనదని ముందుగా ఎవరు ఊహించగలరు!’’ అని ఆమె ఇన్‌స్టాలో తన అనుభవాన్ని పంచుకున్నారు. కార్యక్రమం తాలూకు ఫొటోలు కూడా షేర్ చేశారు. 
Samantha
Sadguru Jaggi Vasudev
Tollywood

More Telugu News