Stock Market: తగ్గేదేలే అంటున్న స్టాక్ మార్కెట్లు.. 20 వేలకు చేరువలో నిఫ్టీ

Markets ends in profits

  • 474 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 146 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2.78 శాతం పెరిగిన ఐటీసీ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతూనే ఉంది. ఈ ఉదయం మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ... మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు ఊపందుకోవడంతో మళ్లీ లాభాల దిశగా దూసుకుపోయాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 474 పాయింట్ల లాభంతో 67,572కి చేరుకుంది. నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 19,979కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.78%), కోటక్ బ్యాంక్ (2.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.24%), మారుతి (1.74%), భారతి ఎయిర్ టెల్ (1.47%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-1.73%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.21%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.09%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.55%), టైటాన్ (-0.27%).

  • Loading...

More Telugu News