AP High Court: ఏపీ హైకోర్టు తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి నిర్ణయానికి రావాలి: కేంద్రం

centre clarifies that ap high court relocation proposal not in pending
  • కర్నూలుకు తరలించాలని 2020లో ఏపీ సీఎం ప్రతిపాదించారన్న కేంద్రం 
  • హైకోర్టును తరలించే ప్రతిపాదన తమ వద్ద పెండింగ్‌లో లేదని స్పష్టీకరణ  
  • వైసీపీ ఎంపీ రంగయ్య ప్రశ్నకు న్యాయ శాఖ సమాధానం
ఏపీ హైకోర్టు తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హైకోర్టును అమరావతి నుంచి తరలించే ప్రతిపాదన తమ వద్ద పెండింగ్‌లో లేదని మరోసారి స్పష్టం చేసింది. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఉమ్మడి నిర్ణయానికి రావాలని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. వైసీపీ ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు న్యాయ శాఖ ఈ రోజు పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి పూర్తిస్థాయి ప్రతిపాదన పంపితే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొంది. ‘‘హైకోర్టును కర్నూలుకు తరలించాలని 2020లో ఏపీ సీఎం ప్రతిపాదించారు. ఈ విషయంలో హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాలి” అని సూచించింది.
AP High Court
centre clarifies
high court relocation
YSRCP
Parliament
talari rangaiah

More Telugu News