Gym Trainer Dies: మెడపై 210 కిలోల బార్బెల్ పడి జిమ్ ట్రైనర్ మృతి.. వీడియో ఇదిగో!
![Indonesia Gym Trainer Dies After Weight Falls On Neck](https://imgd.ap7am.com/thumbnail/cr-20230722tn64bb485fce4e9.jpg)
- ఇండోనేషియాలోని బాలిలో ఘటన
- స్క్వాట్ప్రెస్ చేస్తుండగా బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిన విక్కీ
- మెడ విరిగి దెబ్బతిన్న నరాల వ్యవస్థ
- అత్యవసర ఆపరేషన్ చేసినా ఫలితం శూన్యం
తాను లిఫ్ట్ చేస్తున్న వెయిట్ మీదపడడంతో ఇండోనేషియాలోని బాలిలో ఓ ఫిట్నెస్ ట్రైనర్ ప్రాణాలు కోల్పోయాడు. 33 ఏళ్ల జస్టిన్ విక్కీ.. బార్బెల్ ఎత్తుతుండగా అదికాస్తా అతడి మెడపై పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 15న జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
స్క్వాట్ప్రెస్ కోసం విక్కీ 210 కేజీల బరువున్న బార్బెల్ను ఎత్తి తన భుజాలపై పెట్టుకున్నాడు. అయితే, అంత బరువును కాయడంలో బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడడంతో, బార్బెల్ అతడి మెడపై పడింది. దీంతో మెడ విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి గుండె, కాలేయానికి సంబంధించిన నరాల వ్యవస్థ దెబ్బతింది. విక్కీని వెంటనే ఆసుప్రతికి తరలించారు. అక్కడాయనకు అత్యవసర ఆపరేషన్ నిర్వహించారు. అయితే, ఆ తర్వాత కాసేపటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.