Vadapalli Sri Venkateswara Swamy Temple: వారం వారం విమానంలో వచ్చి వాడపల్లి వెంకన్నను దర్శించుకుంటున్న బెంగళూరు వ్యాపారి

Bengaluru Devotee Visits Vadapalli Sri Venkateswara Swamy Temple Every Week In His Own Flight
  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కొలువైన వెంకన్న
  • ఏడు వారాలు దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం
  • ప్రతివారం సొంత విమానంలో వచ్చి దర్శించుకెళ్తున్న భక్తుడు
  • ఆలయ అభివృద్ధికి కోటి విరాళం
బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ప్రతి వారం విమానంలో వచ్చి ఏపీలోని వాడపల్లి వెంకన్నస్వామిని దర్శించుకుంటుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వరస్వామిని ఏడు వారాలు క్రమం తప్పకుండా దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు తన సొంత విమానంలో వారంవారం వాడపల్లి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వారాలు పూర్తయ్యాయి. సొంత విమానంలో రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి కారులో వాడపల్లి వస్తున్నారు. కాగా, ఆలయ అభివృద్ధికి భక్తుడు కోటి రూపాయల విరాళం ఇచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
Vadapalli Sri Venkateswara Swamy Temple
Dr BR Ambedkar Konaseema District
Bengaluru Devotee

More Telugu News