Actor Suriya: నరసరావుపేటలో విషాదం.. నటుడు సూర్య ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్‌తో ఇద్దరు విద్యార్థుల మృతి

Two students died due to electric shock while actor Surya Flexi Tying
  • సూర్య జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఘటన
  • ఫ్లెక్సీ ఐరన్ ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తాకడంతో షాక్
  • డిగ్రీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు
అభిమాన హీరో ఫ్లెక్సీ కడుతుంటే విద్యుదాఘాతానికి గురైన ఇద్దరు డిగ్రీ సెకండియర్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిందీ ఘటన. మృతులను నక్కా వెంకటేశ్, పోలూరు సాయిగా గుర్తించారు. 

పోలీసుల కథనం ప్రకారం.. సూర్య పుట్టిన రోజును పురస్కరించుకుని మోపూరివారిపాలేనికి చెందిన వెంకటేశ్, బాపట్ల జిల్లా జే పంగలూరుకు చెందిన సాయి స్నేహితులతో కలిసి గత రాత్రి నరసరావుపేటలో ఫ్లెక్సీలు కడుతుండగా దాని ఐరన్ ఫ్రేమ్ పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురైన విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Actor Suriya
Suriya Birth Day
Narasaraopeta

More Telugu News