Renigunta Railwaystation: రైల్వే సిబ్బంది పొరపాటు..400 మంది ప్రయాణికులకు ఊహించని షాక్
- రైళ్ల రాకపై ప్రకటనలో అసాధారణ పొరపాటు
- 5వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చే రైళ్లు 2వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తాయని ప్రకటన
- ప్రకటన ప్రకారం అక్కడ వేచి చూస్తుండగా వచ్చివెళ్లిపోయిన రైళ్లు
- తాము రైలు మిస్సయ్యామని తెలిసి లబోదిబోమన్న ప్రయాణికులు
రైల్వే సిబ్బంది పొరపాటుతో ఏకంగా 400 మంది ప్రయాణికులు ఇక్కట్ల పాలైన ఘటన రేణిగుంట రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైళ్లు ఒక ప్లాట్‌ఫాంకు బదులు మరో ప్లాట్‌ఫాంకు వస్తాయని చెప్పడంతో వారందరూ రైళ్లు మిస్ అయ్యారు. ఆదివారం రాత్రి భువనేశ్వర్‌వైపు వెళ్లే రైళ్లు 5వ నంబర్ ప్లాట్‌ఫాం వైపు రావాల్సి ఉంది. అయితే, అవి 2వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తాయని సిబ్బంది పొరపాటున ప్రకటించడంతో ప్రయాణికులంతా అక్కడికి చేరుకున్నారు. ఈలోపు ఆ రెండు రైళ్లు 5వ నంబర్ ప్లాట్‌ఫారానికి వచ్చి వెళ్లిపోయాయి. జరిగింది తెలిసి లబోదిబోమనడం ప్రయాణికుల వంతైంది.