Jagan: 6 ఆహారశుద్ది యూనిట్లకు ప్రారంభోత్సవం, 5 యూనిట్లకు శంకుస్థాపన చేసిన జగన్

Jagan stars 11 food processing units

  • 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన జగన్
  • ఈ ప్రాజెక్టుల ద్వారా 925 మందికి ప్రత్యక్షంగా ఉపాధి
  • వీటి నుంచి లబ్ధి పొందనున్న 40,307 మంది రైతులు

ఆహారశుద్ధి పరిశ్రమకు ప్రోత్సాహాన్నిచ్చేలా పలు ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు శ్రీకారం చుట్టారు. రూ. 1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులను ఈ ఉదయం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. వాటిలో ఆరు యూనిట్లకు ప్రారంభోత్సవం, ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్లకు 3.14 లక్షల టన్నుల సామర్థ్యం ఉంది. వీటి ద్వారా 925 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. అంతేకాదు 40,307 మంది రైతులకు మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమంతో పాటు ఆర్బీకేలకు అనుబంధంగా నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, 43 కోల్డ్ రూమ్స్ ను రైతులకు సీఎం అంకితం చేశారు. ఈరోజు జగన్ ప్రారంభించిన ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు టమాటా, ఒకటి మిల్లెట్స్, ఒకటి ఉల్లి ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News