Singapore: రెండు దశాబ్దాల తర్వాత సింగపూర్ లో మహిళకు ఉరిశిక్ష అమలు
- సింగపూర్ లో చట్టాలు అత్యంత కఠినం
- 15 గ్రాముల కంటే ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ రవాణా చేస్తే మరణశిక్షే!
- 30 గ్రాముల హెరాయిన్ తో పట్టుబడిన సారిదేవి దామని
- 2018లో మరణశిక్ష విధించిన సింగపూర్ కోర్టు
- జులై 26న ఉరి అమలు
అత్యంత కఠిన చట్టాలకు నెలవుగా ఉండే సింగపూర్ దేశంలో 2004లో ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేశారు. 36 ఏళ్ల ఆ మహిళ చేసిన నేరం డ్రగ్స్ రవాణా. సింగపూర్ లో 15 గ్రాముల కంటే అధిక మొత్తంలో డ్రగ్స్ రవాణా చేస్తే మరణశిక్ష తప్పదు.
ఇప్పుడు మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత సింగపూర్ లో మరో మహిళను ఉరి తీయనున్నారు. సారిదేవి దామని అనే 45 ఏళ్ల మహిళ డ్రగ్స్ కేసులో పట్టుబడింది. ఆమె 30 గ్రాముల హెరాయిన్ ను రవాణా చేసినట్టు సింగపూర్ పోలీసులు అభియోగాలు మోపారు. నేర నిర్ధారణ కావడంతో 2018లో సారిదేవి దామనికి కోర్టు ఉరిశిక్ష విధించింది.
ఆమెకు రేపు (జులై 26) ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇప్పటికే ఆమె కుటుంబానికి సింగపూర్ అధికారులు సమాచారం అందించారు. సింగపూర్ లో హక్కులపై పోరాడే ట్రాన్స్ ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.