Nara Lokesh: ఏ ఊరు వెళ్లినా ముందు అవే కనిపిస్తాయి: లోకేశ్

Lokesh held meeting with bike mechanics in Santhanuthalapadu

  • సంతనూతలపాడు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • బైక్ మెకానిక్ లతో లోకేశ్ సమావేశం
  • కొత్త టెక్నాలజీకి అనుగుణంగా బైక్ మెకానిక్స్ కు శిక్షణ ఇస్తామన్న లోకేశ్
  • సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని వెల్లడి

సంతనూతలపాడు నియోజకవర్గంలో 165వ రోజు యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. సంతనూతలపాడు శివారు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలనుంచి అపూర్వ స్పందన లభించింది. బైక్ మెకానిక్ లతో సమావేశమైన యువనేత వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ బైక్ మెకానిక్ ల తరహాలో దుస్తులు ధరించడం విశేషం. సంతనూతలపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర... ఎండ్లూరు, పేర్నమిట్ట మీదుగా ఒంగోలు శివారు పాలకేంద్రం విడిది కేంద్రానికి చేరుకుంది. 

మెకానిక్ లతో భేటీలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్....

బైక్ మెకానిక్స్ సంక్షేమానికి ప్రత్యేక బోర్డు

పేదరికం లేని రాష్ట్రం టీడీపీ లక్ష్యం. స్వయం ఉపాధికి పెద్ద పీట వేస్తాం. ఏ ఊరు వెళ్ళినా ముందు కనపడేది మెకానిక్ షెడ్లే. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా బైక్ మెకానిక్స్ కి నైపుణ్య శిక్షణ ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బైక్ మెకానిక్స్ ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటాం. 

బైక్ మెకానిక్స్ సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశంపై పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. కొన్ని లక్షల మంది ఆధారపడిన బైక్ మెకానిక్ రంగాన్ని టీడీపీ ప్రభుత్వం ఆదుకుంటుంది.

చెయ్యాల్సిన సరదా పనులన్నీ చేశాను!

నేను చిన్నప్పుడు కారు కూడా తయారు చేశాను. నాకు ఒక మెకానిక్  ఫ్రెండ్ ఉంటే అతని దగ్గర బైక్ ఇంజిన్ తీసుకొని ఇద్దరు ప్రయాణం చేసేలా కారు రూపొందించాను. అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. 

చిన్నప్పుడు చెయ్యాల్సిన సరదా పనులు అన్నీ చేశాను. కాలేజ్ కి బంక్ కొట్టి సినిమాకి వెళ్లి ఇంట్లో దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి. అమ్మ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బైక్ నడపడం నాకు ఇష్టం. ఎన్నో సార్లు బైక్ రిపేర్ వచ్చినప్పుడు మెకానిక్ దగ్గరకి రిపేర్ కి తీసుకువెళ్లాను.

బైక్ మెకానిక్ లకు ప్రభుత్వ గుర్తింపుకార్డులు, వైద్యబీమా కల్పిస్తాం

జగన్ అసమర్థ పాలన, కోవిడ్ దెబ్బకి ఆదాయాలు తగ్గి టూ వీలర్ అమ్మకాలు తగ్గాయి. దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఉన్నాయి. కరోనా కంటే ముందు జగరోనా వైరస్ వచ్చింది. చంద్రబాబు రూపంలో మరో 9 నెలల్లో జగరోనా వైరస్ కి వ్యాక్సిన్ వస్తుంది. 

నేను బైక్ మెకానిక్స్ తో సమావేశం ఏర్పాటు చేస్తున్నానని తెలిసి బైక్ మెకానిక్స్ ని కూడా షాపులు మూసేయాలని వైసీపీ నాయకులు బెదిరించారు. పాదయాత్రలో బైక్ మెకానిక్స్ ఎంతో మంది నన్ను కలిసి బాధలు చెప్పుకున్నారు. బైక్ మెకానిక్స్ కూడా జగన్ బాధితులే.

కొత్త టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ

నేడు అనేక కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. బీస్ 5, బీస్ 6, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు బైక్ మెకానిక్స్ కి శిక్షణ ఉచితంగా అందించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా లేదా పార్లమెంట్ ని యూనిట్ గా తీసుకొని బైక్ రిపేర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధునాతన పనిముట్లు అందిస్తాం. 

మెకానిక్ షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి కార్పొరేషన్లు ద్వారా సబ్సిడీ రుణాలు అందిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బైక్ మెకానిక్స్ కి ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందజేస్తాం. వైద్య సాయం, చంద్రన్న బీమా బైక్ మెకానిక్స్ కి అమలు చేస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2189.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 11.3 కి.మీ.*

*166వరోజు (26-7-2023) పాదయాత్ర వివరాలు*

*ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)*

సాయంత్రం

4.00 – ఒంగోలు శివారు పాలకేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం.

4.20 – పాదయాత్ర ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

4.35 – ఒంగోలు సమతానగర్ లో మహిళలతో సమావేశం.

4.50 – కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద స్థానికులతో మాటామంతీ.

5.25 – మంగమూరు రోడ్డు జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.40 – బెతూన్ నర్సింగ్ హోమ్ వద్ద స్థానికులతో సమావేశం.

6.55 – లాయర్ పేట సాయిబాబా గుడివద్ద బ్రాహ్మణులతో సమావేశం.

7.10 – కొంజేడు బస్టాండులో కాపు సామాజికవర్గీయులతో భేటీ.

7.15 – కోర్టు సెంటర్ లో న్యాయవాదులతో సమావేశం.

7.30 – సివిఎన్ రీడింగ్ రూమ్ వద్ద ఆర్యవైశ్య సామాజికవర్గీయులతో భేటీ.

7.35 – శివాలయం జంక్షన్ లో స్థానికులతో సమావేశం.

7.50 – చర్చి సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.

8.05 – మిరియాలపాలెం ట్రంకురోడ్డులో స్వర్ణకారులతో సమావేశం.

8.15 – ఓల్డ్ మార్కెట్ వద్ద స్థానికులతో మాటామంతీ.

8.25 – ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.

8.30 – అద్దంకి బస్టాండు సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.

8.40 – ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాలు వద్ద ముస్లింలతో సమావేశం.

8.50 – పోతురాజుకాల్వ వద్ద స్థానికులతో మాటామంతీ.

9.00 – నెహ్రూనగర్ లో మోటార్ వెహికల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.

9.15 – రవిప్రియ ఫంక్షన్ హాలు ఎదుట విడిది కేంద్రంలో బస.

******

  • Loading...

More Telugu News