Team India: విండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో వైదొలిగిన సిరాజ్‌

Siraj released from India ODI squad
  • ఈ రోజు భారత్, వెస్టిండీస్‌ మధ్య తొలి వన్డే
  • చీలమండ నొప్పితో బాధపడుతున్న సిరాజ్‌
  • సిరీస్‌ నుంచి తప్పించిన బీసీసీఐ
వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌ గెలిచి జోరు మీదున్న భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. అయితే, ఈ సిరీస్‌ కు ముందు రోహిత్‌సేనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా అతడు ఈ సిరీస్‌ నుంచి వైదొలిగాడు. ప్రాక్టీస్ తర్వాత చీలమండలో నొప్పి వచ్చినట్టు సిరాజ్‌ తెలిపాడు. దాంతో ఈ సిరీస్‌ నుంచి బీసీసీఐ అతడిని రిలీజ్‌ చేసింది. 

సిరాజ్‌ను పరీక్షించిన బీసీసీఐ వైద్య బృందం ముందు జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. దాంతో, ఈ సిరీస్‌ నుంచి అతను తప్పుకోవాల్సి వచ్చింది. విండీస్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన సిరాజ్‌ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ గా నిలిచాడు. బుమ్రా, షమీ అందుబాటులో లేకపోవడంతో భారత పేస్ బృందాన్ని సిరాజ్‌ నడిపిస్తున్నాడు. అతను దూరం కావడం వన్డే సిరీస్‌లో భారత్‌కు కచ్చితంగా లోటు కానుంది.
Team India
west indies
ODI series
siraj
injury

More Telugu News