Amit Shah: మోదీని ఇబ్బంది పెట్టేందుకే మహిళల నగ్న వీడియోను విడుదల చేశారు: అమిత్ షా

Manipur woman video released to trouble Modi govt says Amit Shah
  • మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వైనం
  • వీడియో విడుదల వెనుక కుట్ర కోణం ఉందన్న అమిత్ షా
  • పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే కుట్ర జరిగిందని వ్యాఖ్య
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆ తర్వాత వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మహిళల నగ్న వీడియో విడుదల వెనుక కుట్ర ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఈ కుట్ర జరిగిందని మండిపడ్డారు.

1990వ దశకం నుంచి మణిపూర్ లో కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పారు. మహిళలను నగ్నంగా చిత్రీకరించిన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మణిపూర్ లో పరిస్థితిని మరింత రెచ్చగొట్టడం కోసమే ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారని చెప్పారు. 

మరోవైపు మణిపూర్ ఘర్షణలకు సంబంధించి ఏడు కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించామని అమిత్ షా చెప్పారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసు కూడా వీటిలో ఉందని తెలిపారు. ఈ కేసుల విచారణ వేరొక రాష్ట్రంలో జరగాలని సుప్రీంకోర్టును కోరామని చెప్పారు.
Amit Shah
Narendra Modi
BJP
Manipur
Woman
Naked parade

More Telugu News