Anitha: ఏపీ హైకోర్టులో టీడీపీ నేత అనితకు ఊరట

Anitha gets relief in AP High Court
  • ఇటీవల సజ్జనరావు అనే వ్యక్తి ఇంటి ముందు అనిత ఆందోళన
  • నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన పోలీసులు
  • అనితపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
తెలుగుదేశం పార్టీ నాయకురాలు వంగలపూడి అనితకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై అసభ్యకరమైన పోస్టింగులు పెట్టారంటూ నందిగామకు చెందిన సజ్జనరావు అనే వ్యక్తి ఇంటి ముందు అనిత నేతృత్వంలో తెలుగు మహిళలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. 

ఈ కేసులపై అనిత హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో అనిత తరపున న్యాయవాది సతీశ్ వాదనలు వినిపించారు. వాదనలను విన్న తర్వాత హైకోర్టు పోలీసులకు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అనితపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
Anitha
Telugudesam
AP High Court

More Telugu News