Munneru: విజయవాడ-హైదరాబాద్ మధ్య తగ్గిన మున్నేరు ఉద్ధృతి... మొదలైన రాకపోకలు
- ఏపీలో భారీ వర్షాలు
- ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు వాగు ఉద్ధృతం
- ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి వరద
- గురువారం సాయంత్రం నుంచి నిలిచిన రాకపోకలు
- తాజాగా రాకపోకల పునరుద్ధరణ
భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడం తెలిసిందే. దాంతో, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఐతవరం వద్ద మున్నేరు ఉప్పొంగడంతో రహదారిపై వరద నీరు ప్రవహించింది. దాంతో పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇప్పుడు ఐతవరం వద్ద మున్నేరు ప్రవాహ తీవ్రత తగ్గడంతో తాజాగా, ఆ మార్గంలో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసులు దగ్గరుండి వాహనాలను ముందుకు పంపిస్తున్నారు.
నిన్న సాయంత్రం నుంచి ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడం తెలిసిందే. గత 24 గంటలుగా వాహనాలను పోలీసులు నందిగామ నుంచి మధిర మీదుగా విజయవాడకు మళ్లించారు.