Rottela Panduga: నెల్లూరులో నేటి నుంచి ఐదు రోజులపాటు రొట్టెల పండుగ
- పండుగకు ముస్తాబైన బారాషాహిద్ దర్గా, స్వర్ణాల చెరువు
- ఆగస్టు 2న పండుగ ముగింపు
- స్వర్ణాల చెరువులో రొట్టెల పంపిణీ
- కోరిన కోర్కెలు తీర్చే పండుగగా ప్రసిద్ధి
నేటి నుంచి ఐదు రోజులపాటు నెల్లూరులో రొట్టెల పండుగ జరగనుంది. పండుగలో భాగంగా నేడు సందన్ మాలి (సమాధుల శుభ్రం), రేపు గంధ మహోత్సవం, 31న రొట్టెల పండుగ, 1న తహలిల్ ఫాతేహా (గంధం పంపిణీ), 2న పండుగ ముగింపు ఉంటాయి. కోరిన కోర్కెలు తీర్చే పండుగగా రొట్టెల పండుగకు ఎంతో పేరుంది.
ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి పండుగలో పాల్గొంటారు. పండుగ కోసం బారాషాహీద్ దర్గా, స్వర్ణాల చెరువును అందంగా ముస్తాబు చేశారు. రొట్టెల పండుగ రోజున స్వర్ణాల చెరువులో ఒకరికొకరు రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. మనసులో కోరుకుని రొట్టెను పుచ్చుకుంటే అవి నెరవేరుతాయని భక్తుల నమ్మకం.