Amazon: ఆగస్టు 5 నుంచి అమెజాన్ లో ఆఫర్ల జాతర

Amazon anounced Great Freedom Festival Sale
  • గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ తేదీలు ప్రకటించిన అమెజాన్
  • స్మార్ట్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు
  • ఆగస్టు 9 వరకు కొనసాగనున్న సేల్
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను ప్రకటించింది. ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహించే ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్లు తెలిపింది. ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందే.. అంటే ఆగస్టు 4 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ టీవీలు సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

రియల్‌మీ, శామ్‌సంగ్, వన్‌ప్లస్ తదితర బ్రాండ్‌ల స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ తోపాటు ఎస్ బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈమేరకు కంపెనీ సేల్ టీజర్ వీడియో విడుదల చేసింది. ల్యాప్‌టాప్‌, ఇయర్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌ తదితర ఉత్పత్తులపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని వివరించింది. అయితే, ఏయే కేటగిరీలో ఎంత శాతం డిస్కౌంట్ ఉంటుందనే కచ్చితమైన వివరాలను మాత్రం వెల్లడించలేదు.

రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర హోం అప్లయన్సెస్‌పైనా భారీ ఆఫర్లు ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాల సమాచారం. వీటితో పాటు గేమింగ్ ప్రొడక్టుల పైనా 80 శాతం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Amazon
e-commers
great freedom sale
smart phones

More Telugu News