Siddaramaiah: సిద్ధరామయ్య సార్.. ఏదో ఒక మంత్రికి నన్ను పీఏ చేయండి: ఎమ్మెల్యే ఆవేదన

MLA letter to Siddaramaiah requesting to make him PA for minister
  • నిధులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • మంత్రులు స్పందించడం లేదని ఎమ్మెల్యేల లేఖలు
  • ఎమ్మెల్యేల ఇబ్బందులు తెలుసుకోవాలని మంత్రులకు సిద్ధరామయ్య మందలింపు
కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశలో ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులను చేయలేకపోతున్నామని, మంత్రులెవరూ స్పందించడం లేదని ఇటీవల 30 మంది ఎమ్మెల్యేలు సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక సంచలన లేఖ వెలుగుచూసింది. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు చేయలేకపోతున్నానని... తనను కనీసం ఏదో ఒక మంత్రికి పీఏగానో, పీఎస్ గానో నియమించాలని సిద్ధరామయ్యకు మరో ఎమ్మెల్యే లేఖ రాశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో సిద్ధరామయ్య బయటపెట్టారు. ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవాలంటూ మంత్రులను సిద్ధరామయ్య మందలించారు.
Siddaramaiah
Karnataka
MLAs

More Telugu News