USA: అమెరికాలో దారుణం.. మహిళను కత్తితో పొడిచి చంపి.. ఆమె చివరి క్షణాలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన నిందితుడు

US man stabs woman to death and posts video of her last moments on Facebook
  • అమెరికాలోని బే ఏరియాలో ఘటన
  • ఫేస్‌బుక్‌లో వీడియో చూసి పోలీసులకు సమాచారమిచ్చిన నెటిజన్
  • రెండు గంటల్లోనే నిందితుడికి బేడీలు
అమెరికాలోని బే ఏరియాలో దారుణం జరిగింది. ఓ మహిళను పొడిచి చంపిన నిందితుడు ఆమె చివరి క్షణాలను వీడియో తీసి దానిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అది చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అతడిచ్చిన ఫోన్ నంబరు ఆధారంగా పోలీసులు నిందితుడిని కటకటాల వెనక్కి పంపారు. 39 ఏళ్ల అనుమానితుడిని శాన్‌జోస్‌కు చెందిన మార్క్ మెచికోఫ్‌గా గుర్తించారు. బాధితురాలు అతడికి ముందే తెలుసని పేర్కొన్నారు.  

హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మహిళను హత్య చేసిన నిందితుడు ఆమె చివరి క్షణాలను వీడియో తీసి దానిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని రెండు గంటల్లోనే అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
USA
Facebook
Crime News

More Telugu News