PSLV: పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో పీఎస్ఎల్వీ రాకెట్ శకలం... నిర్ధారించిన ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ

PSLV debris found in Western Australian beach

  • గతంలో  పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం
  • ఆస్ట్రేలియాలోని జూరియన్ బే బీచ్ లో పడిన పీఎస్ఎల్వీ మూడో దశ శకలం
  • ఇస్రోకు సమాచారం అందించిన ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తరచుగా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా పలు శాటిలైట్లను కక్ష్యల్లోకి చేర్చుతుండడం తెలిసిందే. గతంలో ప్రయోగించిన ఓ పీఎస్ఎల్వీ రాకెట్ శకలం ఇటీవల ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చింది. స్థానికులు ఇదేదో వింత వస్తువు అని భావించారు. అయితే, ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ఇది భారత రాకెట్ శకలం అని తాజగా నిర్ధారించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. 

"పశ్చిమ ఆస్ట్రేలియాలోని జూరియన్ బే సమీపంలోని ఓ బీచ్ వద్ద ఇటీవల ఓ వస్తువును గుర్తించాం. ఇది బహుశా పోలార్ శాటిలైల్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) మూడో దశ నుంచి విడవడిన శకలం అయ్యుంటుందని నిర్ధారణకు వచ్చాం. ఇస్రో వినియోగించే మధ్య శ్రేణి రాకెట్... పీఎస్ఎల్వీ. జూరియన్ బే బీచ్ లో లభ్యమైన వస్తువును భద్రపరిచాం. దీనిపై ఇస్రోతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఐక్యరాజ్యసమితి అంతరిక్ష నిబంధనలను అనుసరించి ఏంచేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటాం. ఆస్ట్రేలియన్లు ఎవరైనా ఇలాంటివే ఏవైనా వస్తువులను గుర్తిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి" అంటూ వివరించింది.

  • Loading...

More Telugu News