Vande Bharat: ఈ నెల 6 నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ 'వందేభారత్' ఎక్స్‌ప్రెస్

Kachiguda yashwantpur vandebharat express to be launched on 6th of august

  • వందేభారత్ ప్రారంభానికి దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు
  • కాచిగూడ నుంచి నంద్యాల జిల్లా డోన్ మీదుగా యశ్వంత్‌పూర్‌కు మార్గం
  • సోమమారం ట్రయల్‌ నిర్వహణ, రైలు డోన్ నుంచి కాచిగూడ చేరుకున్న వైనం

తెలుగు ప్రజలకు త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 6న ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. 

నంద్యాల జిల్లా డోన్ మీదుగా వెళ్లే ఈ రైలు ట్రయల్ రన్‌లో భాగంగా సోమవారం ఉదయం 6.30 గంటలకు డోన్‌లో బయలుదేరి 10.30 గంటలకు కాచిగూడకు చేరుకుంది. ప్రస్తుతం అధికారులు ఈ రైలును స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం-5పై నిలిపి ఉంచారు. ఆరోజు ప్రధాని మోదీ దీనిని ప్రారంభించడంతో పాటు, అమృత్ భారత్ స్టేషన్లు మల్కాజిగిరి, మలక్‌పేట, ఉప్పుగూడ, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, కర్నూల్‌లో పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

  • Loading...

More Telugu News