The Hunt for Veerappan: నెట్ ఫ్లిక్స్ లో 'ది హంట్ ఫర్ వీరప్పన్' .. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

The Hunt for Veerappan Update

  • వీరప్పన్ లోని కొత్త కోణాలతో 'ది హంట్ ఫర్ వీరప్పన్'
  • నెట్ ఫ్లిక్స్ నుంచి వస్తున్న మరో క్రైమ్ డాక్యుమెంటరీ ఇది 
  • ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • రియల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరపడం విశేషం


వీరప్పన్ .. కర్ణాటక .. తమిళనాడు అడవీ ప్రాంతాలను శాసించిన గంధపు చెక్కల స్మగ్లర్. అటవీప్రాంతాలకు చుట్టూ ఉన్న రాష్ట్రాల పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన వ్యక్తి. తన వ్యూహాలతో .. అకృత్యాలతో హడలెత్తించిన నరరూప రాక్షసుడు. ఆయన గురించి కొంతమంది పుస్తకాలు రాస్తే, తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఆయనపై సినిమాలు కూడా వచ్చాయి. 

అలాంటి వీరప్పన్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు, ఆయన గురించి ప్రపంచానికి తెలియని కొన్ని విషయాలను .. కోణాలను 'ది హంట్ ఫర్ వీరప్పన్' డాక్యుమెంటరీ సిరీస్ ద్వారా ఆవిష్కరించనున్నట్టు దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చెప్పాడు. సుదీర్ఘమైన పరిశోధన తరువాతనే తాము రంగంలోకి దిగినట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. 

ఇంతవరకూ వీరప్పన్ లోని బందిపోటును మాత్రమే అందరూ చూపిస్తూ వచ్చారనీ, ఆయనలోని రాబిన్ హుడ్ కోణాన్ని తాము చూపించనున్నామని సెల్వరాజ్ అన్నాడు. కన్నడ సీనియర్ స్టార్ హీరో రాజ్ కుమార్ కిడ్నాప్ గురించిన అంశాలు కూడా చూపించనున్నామని చెప్పాడు. అపూర్వ బక్షి నిర్మించిన ఈ డాక్యుమెంటరీ సిరీస్ 4 ఎపిసోడ్స్ గా ఈ నెల 4 నుంచి సెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. నిజమైన ప్రాంతాలలో .. ప్రదేశాలలో చిత్రీకరించడం ఈ సిరీస్ ప్రత్యేకత. 

  • Loading...

More Telugu News