Andhra Pradesh: ఏపీలో రిటర్నింగ్ అధికారుల నియామకం... 2024 ఎన్నికల తొలి అంకానికి శ్రీకారం

SEC appointed ROs to all constituencies in AP
  • ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు
  • 175 నియోజకవర్గాలకు ఆర్వోల నియామకం
  • గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ ముఖేశ్ కుమార్ మీనా
ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు, ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజల మనసులు గెలుచుకునేందుకు ఇప్పటినుంచే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుండగా, ఇటు ఎన్నికల సంఘం కూడా 2024 ఎన్నికల ప్రక్రియ తొలి అంకానికి శ్రీకారం చుట్టింది. 

తాజాగా, ఏపీలో రిటర్నింగ్ అధికారుల (ఆర్వో) నియమాకం జరిగింది. ఎన్నికల సంఘం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఆర్వోలను నియమించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ ఆదేశాలతో ఆర్వోల నియామకం చేపట్టారు.
Andhra Pradesh
RO
SEC
2024 Elections

More Telugu News