Asaduddin Owaisi: హైదరాబాద్ యూటీగా మారబోతుందంటూ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
- హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలు యూటీగా మారే రోజులు ఎంతో దూరంలో లేవన్న ఎంపీ
- ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నానని వ్యాఖ్య
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ మనిషేనన్న ఒవైసీ
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా మారే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలు కూడా యూటీలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నానని తెలిపారు.
ఢిల్లీ ఆర్డినెస్స్ పై లోక్ సభలో జరిగిన చర్చలో అసదుద్దీన్ మాట్లాడారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు అన్నారు. దీన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు రాజకీయ పోరాటాన్ని సభ బయట చూసుకోవాలన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ మనిషేనన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల ఆలోచనల నుంచే ఆయన బయటకు వచ్చారని చెప్పారు.