Daggubati Purandeswari: హైకోర్టు తీర్పుతో కేంద్రం నిర్ణయాలు ధర్మం పక్షమని తేలిపోయింది: పురందేశ్వరి
- అర్హులైన పేదలకు వారి సొంత ప్రాంతంలోనే ఇళ్లను నిర్మిస్తే బాగుంటుందని సూచన
- కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వలేమని కేంద్రం చెప్పిందని వెల్లడి
- దేశంలోనే అత్యధిక పీఎంఏవై ఇళ్లను మోదీ ప్రభుత్వం ఏపీకి కేటాయించిందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్లో అర్హులైన పేదలకు వారి సొంత ప్రాంతంలోనే ఇళ్లను నిర్మిస్తే మంచిదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అమరావతిలోని ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు. కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వడం కుదరదని కేంద్రం వెల్లడించిందన్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు న్యాయం, ధర్మం పక్షం అనేది తేలిపోయిందన్నారు. దేశంలోనే అత్యధికంగా పీఎంఏవై ఇళ్లను ఏపీకి మోదీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. కేంద్రం పేదల కోసం కేటాయించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్మించి, అర్హులకు ఇవ్వాలన్నారు. వివాదాలు లేని స్థలాల్లో ఇళ్లను నిర్మించాలన్నారు.