Vijay Antony: అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న 'హత్య'
- విజయ్ ఆంటోని నుంచి రీసెంట్ గా వచ్చిన 'హత్య'
- మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ
- థియేటర్స్ నుంచి పెద్దగా రాని రెస్పాన్స్
- ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
విజయ్ ఆంటోని కథానాయకుడిగా రూపొందిన 'హత్య' సినిమా, జులై 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. బాలకీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, శివకుమార్ విజయన్ సంగీతాన్ని అందించాడు. రితిక సింగ్ - మీనాక్షి సింగ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఆ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారు. విజయ్ ఆంటోనీ ఫ్లాప్ సినిమాలు కూడా, కంటెంట్ పరంగా ఓటీటీల వైపు నుంచి మంచి మార్కులను తెచ్చుకున్నాయి. అదే మేజిక్ ఈ సినిమా విషయంలో జరిగే ఛాన్స్ ఉంది.
ఈ కథలో లైలా అనే మోడల్ హత్యకి గురవుతుంది. ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది కనిపెట్టడం పోలీసులకు సవాల్ గా మారుతుంది. అప్పుడు వినాయక్ పాత్రలో హీరో రంగంలోకి దిగుతాడు. ఆయన ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు? అందుకోసం ఎలాంటి ప్లాన్స్ వేశాడు? అనే దిశగా ఈ సినిమా నడుస్తుంది.