pregnant women: యూపీలోని ఒకే ఆసుపత్రిలో 81 మంది గర్భిణులకు హెచ్ ఐవీ పాజిటివ్

Over 81 pregnant women found HIV positive in 16 months in UP hospital probe ordered
  • యూపీలోని మీరట్ జిల్లా వైద్య కళాశాలలో ఘోరం
  • ప్రసవం కోసం చేరిన మహిళల్లో హెచ్ఐవీ నిర్ధారణ
  • కారణాలను గుర్తించేందుకు కమిటీ నియామకం
ఇదొక ఘోరం. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో హెచ్ ఐవీ సోకిన గర్భిణుల కేసులు పెద్ద మొత్తంలో వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన 16 నెలల కాలంలో 81 మంది గర్భిణులకు హెచ్ఐవీ ఉన్నట్టు ఇక్కడ గుర్తించారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అసలేం జరుగుతోందన్న దానిపై విచారణ ఆరంభించారు.

లాలా లజపత్ రాయ్ మెడికల్ కళాశాలలో ప్రసవం కోసం చేరిన  (డెలివరీ) గర్భిణుల రక్త నమూనాలను సహజంగా సేకరిస్తుంటారు. ఈ పరీక్షల్లో హెచ్ఐవీ ఉన్నట్టు బయటపడుతోంది. ఇక్కడి ఏఆర్ టీ సెంటర్ లో 2022-23 సంవత్సరంలో 33 కొత్త హెచ్ఐవీ కేసులు (గర్భిణులు) వెలుగు చూశాయి. ఈ ఏడాది జూలై వరకు 13 కొత్త కేసులు వచ్చాయి. అంతకుముందు 35 మంది దీని బారిన పడినట్టు గుర్తించారు. 

ఈ గర్భిణులు ప్రసవించిన శిశువులకు 18 నెలలు నిండిన తర్వాతే హెచ్ఐవీ పరీక్షిస్తామని అక్కడి వైద్యులు తెలిపారు. కాకపోతే హెచ్ఐవీ సోకిన గర్భిణులు, వారు ప్రసవించిన చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. అసలు వారు హెచ్ఐవీ బారిన ఎలా పడుతున్నారో కారణాలను గుర్తించేందుకు ఓ బృందాన్ని నియమించారు. హెచ్ఐవీ అనేది రక్త మార్పిడి లేదా లైంగిక కార్యకలాపాల ద్వారానే వస్తుంటుంది.
pregnant women
HIV positive
Uttar Pradesh
meerut

More Telugu News