Ramcharan: ‘గేమ్‌ ఛేంజర్‌‌’ క్లైమాక్స్.. 500 మంది ఫైటర్లతో రామ్‌ చరణ్ భారీ ఫైట్‌

Game Changer recently shot a massive Climax with a cast of 500 fighters
  • భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి
  • శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
  • చరణ్ సరసన హీరోయిన్‌గా కియారా
దిగ్గజ దర్శకుడు శంకర్–రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. చెర్రీ సరసన బాలీవుడ్ నటి కియారా ఆద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. శంకర్ ఈ సినిమాను రెండేళ్ల నుంచి తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది 2023 చివరికల్లా సినిమా పూర్తవుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆసక్తికర అప్‌డేట్ ఒకటి వచ్చింది. 

సినిమా క్లైమాక్స్‌ ఫైట్స్‌ చిత్రీకరణ ఈ మధ్యే పూర్తయింది. దాదాపు 500 మంది ఫైటర్లతో రామ్ చరణ్ పోరాట సన్నివేశాల్లో పాల్గొన్నాడు. ఈ యాక్షన్ సీక్వెల్స్‌ తెలుగు సినిమాలో మునుపెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయన్న చర్చ నడుస్తోంది. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ వచ్చే వారం మొదలవనుంది. భారీ బడ్జెట్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Ramcharan
game changer
kiara adwani
shankar
Dil Raju

More Telugu News