Narendra Modi: ఏపీలోని 18 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన

PM Modi will lay foundation for 18 railway stations in AP
  • అమృత్ భారత్ కింద అభివృద్ధి పనులు
  • రూ.453.5 కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి
  • వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్న మోదీ
ఏపీలో కేంద్ర నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అమృత్ భారత్ కింద రూ.453.5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 18 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 6) వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు, తుని, తెనాలి, అనకాపల్లి, విజయనగరం, తాడేపల్లిగూడెం, సింగరాయకొండ, నిడదవోలు, దొనకొండ, దువ్వాడ, నరసాపురం, రేపల్లె, పిడుగురాళ్ల, పలాస, ఏలూరు, కాకినాడ టౌన్, భీమవరం, ఒంగోలు రైల్వే స్టేషన్లకు కేంద్ర నిధులతో కొత్త హంగులు సమకూరనున్నాయి.
Narendra Modi
Railway Stations
AP
Amrit Bharat
India

More Telugu News