apple cider vinegar: యాపిల్ సిడార్ వెనిగర్.. లాభాలు తెలిస్తే వదిలి పెట్టరు!

apple cider vinegar shot every morning here all the benefits

  • వందల సంవత్సరాలుగా పాశ్చాత్య దేశాల్లో వినియోగం
  • అన్ ఫిల్టర్డ్ రా మథర్ రూపంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు
  • ఇందులో పేగులకు మేలు చేస్తే ప్రొబయాటిక్

యాపిల్ సిడార్ వెనిగర్ గురించి వినే ఉంటారు. ఇటీవలి కాలంలో నలుగురి నోళ్లలో నానుతున్న దీని గురించి గతంలో ఎక్కువ మందికి అవగాహన ఉండేది కాదు. కానీ స్మార్ట్ ఫోన్ల వల్ల ఇప్పుడిప్పుడే దీని ప్రయోజనాలు తెలిసి వస్తున్నాయి.

యాపిల్ సిడార్ వెనిగర్ అంటే..? 
ఫెర్మెంటేషన్ (పులియబెట్టడం) విధానంలో దీన్ని తయారు చేస్తారు. చిదిమేసిన యాపిల్ గుజ్జును ఎసిటిక్ యాసిడ్ గా మారుస్తారు. ఇందుకు ఈస్ట్, షుగర్ ను వాడతారు. ఎసిటిక్ యాసిడ్ తో మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం అయితే ‘యాపిల్ సిడార్ వెనిగర్ రా అన్ ఫిల్టర్డ్ మథర్’ తీసుకోవాలి. మథర్ అంటే బ్యాక్టీరియా, ఈస్ట్ తో చేసిందని అర్థం. అంటే అందులో ఉండే ప్రో బయాటిక్స్ పేగులకు ఆరోగ్యాన్నిస్తాయి.

ప్రయోజనాలు
నిజానికి యాపిల్ సిడార్ వెనిగర్ వినియోగం వందల సంవత్సరాలుగా ఉంది. కాకపోతే మన దేశంలోనే అంతగా తెలియదు. ఏసీవీ మథర్ లో ఉండే ప్రోబయాటిక్ పేగుల ఆరోగ్యానికి సాయం చేయడం వల్ల ఎన్నో జీవక్రియలకు మేలు జరుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. తిన్నది మంచిగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు రక్షణ పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. చర్మం కాంతిగా మారుతుంది. చర్మంపై మొటిమల సమస్య తగ్గుతుంది. 

రోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ రా మథర్ ను 15-30 ఎంఎల్ నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత అయినా తీసుకోవచ్చు. ఈ రెండింటినీ చూసి, ఏ విధంగా ఎక్కువ ప్రయోజనం ఉంటే ఆ విధానాన్ని అనుసరించాలి. ప్లాస్టిక్ బాటిల్ లో కాకుండా, గాజు బాటిల్ లో ఉన్నది అయితే మంచిది.

  • Loading...

More Telugu News