X ray: ఎక్స్ రే చూసి మధుమేహం వచ్చే అవకాశాలను చెప్పేయొచ్చు!
- ఏఐ టూల్ ను అభివృద్ధి చేసిన అమెరికన్ పరిశోధకులు
- ఛాతీ ఎక్స్ రే కంటే రక్త పరీక్షయే సులభం
- ముందస్తుగా గుర్తించడం ఇందులోని అనుకూలత
రక్త పరీక్ష, లేదంటే మూత్ర పరీక్ష మధుమేహం (షుగర్, చక్కెర వ్యాధి) ఉందా, లేదా అని నిర్ధారించే విధానాలు. మరి ఎక్స్ రే ద్వారా ఎలా నిర్ధారిస్తారు? నిజమే. ఛాతీ ఎక్స్ రే చూసి మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నది చెప్పవచ్చని అమెరికా పరిశోధకులు అంటున్నారు. 2010 నుంచి 2021 మధ్య తీసిన 2.7 లక్షల ఎక్స్ రే ఫిల్మ్ ల ఆధారంగా అమెరికా పరిశోధకులు ఓ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ ను అభివృద్ధి చేశారు. ఈ టూల్ సాయంతో ఆ తర్వాత తీసిన 15,000 ఎక్స్ రేలను పరీక్షించి చూశారు. మధుమేహం రిస్క్ ను ఈ ఏఐ ప్రోగ్రామ్ గుర్తించి హెచ్చరించింది. భవిష్యత్తులో డయాబెటిస్ వస్తుందా? లేక మధుమేహం ఆరంభంలో ఉందా? అన్నది కూడా చెబుతుంది.