Manmohan Singh: ఢిల్లీ సేవల బిల్లుపై చర్చ.. చక్రాల కుర్చీలో రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్

Manmohan singh participates in debate over delhi ordinance in Rajya sabha
  • 90 ఏళ్ల వయసులోనూ రాజ్యసభ చర్చలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
  • మౌనంగా ఉంటూనే చర్చను నిశితంగా పరిశీలించిన వైనం
  • అనారోగ్యం, వయసు లెక్క చేయక పార్లమెంటుకు వచ్చిన మాజీ ప్రధానిపై నెట్టింట ప్రశంసలు
ఢిల్లీ సేవల బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. సోమవారం ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు అనుకూలంగా 131 మంది వ్యతిరేకంగా 102 ఓటేశారు. ఉభయ సభలూ బిల్లుకు ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి సంతకం కోసం పంపించనున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో బిల్లు చట్టరూపం దాలుస్తుంది.  

ఓటింగ్‌కు ముందు బిల్లుపై వాడీవేడి చర్చ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో రాజ్యసభకు వచ్చారు. 90 ఏళ్ల వయసులోనూ ఆయన చర్చలో పాల్గొన్నారు. మౌనంగా ఉంటూనే రాజ్యసభ చర్చను నిశితంగా గమనించారు. ఈ వయసులో కూడా అనారోగ్యాన్ని లెక్కచేయకుండా తన బాధ్యతలు నిర్వహించేందుకు వచ్చిన మాజీ ప్రధానిని చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

ఢిల్లీ సేవల బిల్లుతో దేశరాజధానిలోని పరిపాలన యంత్రాంగం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఉద్యోగులపై కేజ్రీవాల్ ప్రభుత్వ నియంత్రణ నామమాత్రంగా మిగిలిపోయింది.
Manmohan Singh
Delhi Ordinance
Rajya Sabha

More Telugu News