Pawan Kalyan: అర్చకుడిపై దాడి అధికార పార్టీ దాష్టీకానికి ప్రతీక: పవన్ కల్యాణ్

janasena chief pawan comments on the attack on the priest in someswara temple
  • భీమవరం సోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడి
  • ఎవరి కళ్లలో ఆనందం కోసం దాడి చేశారని ప్రశ్నించిన పవన్
  • యథా నాయకుడు–తథా అనుచరుడు అనేలా వైసీపీ వాళ్లు తయారయ్యారని విమర్శ
భీమవరం పంచారామక్షేత్రం సోమేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడి చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి యజ్ఞోపవీతాన్ని తెంచారని నిలదీశారు. ఇది పాలక వర్గం అహంభావానికి, దాష్టీకానికి ప్రతీక అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయ బోర్డు చైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించాలని, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ కోరారు. అర్చకులపై దాడి చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం రాక్షసత్వమేనని మండిపడ్డారు. పవిత్ర ఆలయ ప్రాంగణాల్లో అధికార దర్పం చూపడం క్షమార్హం కాదన్నారు. యథా నాయకుడు–తథా అనుచరుడు అనేలా వైసీపీ నాయకులు తయారయ్యారని విమర్శలు చేవారు. ఈశ్వరుని సన్నిధిలో అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan
Someshwara Swamy Temple
bhimavaram
Janasena
YSRCP

More Telugu News